యువతకు 20 లక్షల ఉద్యోగాలు! ఉపాధి ప్రణాళికలపై మంత్రులు, అధికారుల సమీక్ష
యువతకు 20 లక్షల ఉద్యోగాలు! ఉపాధి ప్రణాళికలపై మంత్రులు, అధికారుల సమీక్ష
ఉద్యోగ సృష్టి మరియు పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి నేటి సమీక్ష సమావేశంలో ముఖ్యమైన చర్చలు జరిగాయి. ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో వేగవంతమైన చర్యలు చేపట్టాలని నొక్కిచెప్పాను. గత ఐదు సంవత్సరాలలో సాధించలేని పెట్టుబడులను, మన ప్రభుత్వం కేవలం 11 నెలల్లోనే ఆకర్షించడంలో విజయం సాధించింది.
ఇప్పటివరకు రూ. 9.20 లక్షల కోట్ల మూలధన పెట్టుబడులు మరియు 8.5 లక్షలకు పైగా ఉద్యోగాల సృష్టికి సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. పెట్టుబడులను వేగవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక సూచనలు: - ఎన్టిపిసి, బిపిసిఎల్, రిలయన్స్, టాటా పవర్ వంటి ప్రముఖ సంస్థల ప్రాజెక్టులను పరిశ్రమల వారీగా పర్యవేక్షించేందుకు. EDB (ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్) లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU). ఏర్పాటు చేయాలని సూచించాను.
ఈ యూనిట్ పరిశ్రమలు పూర్తిగా స్థాపించబడేవరకు నిరంతరం మార్గదర్శకత్వం వహించాలి. -బీచ్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. పెట్టాలని, పర్యాటక రంగాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని కోరాను. - పెట్టుబడుల ఆకర్షణతో పాటు, ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా అన్ని అనుబంధ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం ఇచ్చాను. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని, ఆర్థిక వృద్ధికి గట్టి పునాది లభిస్తుందని విశ్వసిస్తున్నాము.
What's Your Reaction?