విజయవాడలో భారీ ఉగ్ర కుట్ర గుట్టురట్టు: పట్టుబడ్డ నిందితులు!
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. ఐసిస్ భావజాలం, జిహాదీ వైపు యువతను మళ్లించే కుట్రపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇది కేవలం స్థానిక నేరం మాత్రమే కాదని, దీని వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. నిందితుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.నిందితులు ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణ సహా 7 రాష్ట్రాలకు చెందిన సుమారు 42 మంది యువకులతో రహస్యంగా సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తేలింది.
'ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్' పేరుతో సోషల్ మీడియాలో గ్రూపులు నిర్వహిస్తూ, ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలనే కుట్రలో భాగంగా వీరు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ దేశాల్లోని ఉగ్రవాద సంస్థలతో వీరు టచ్‌లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. భారతీయ యువతను జిహాదీ వైపు మళ్లించి, విదేశాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లలో జిహాదీ ఆడియో క్లిప్పింగ్‌లు, దేశ వ్యతిరేక సందేశాలు లభించాయి.
పోలీసుల హెచ్చరిక:
ఈ కేసును ఏపీ పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. యువత సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, అనుమానాస్పద గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే మూలకాలను ఏరివేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
What's Your Reaction?