పొదిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా! పట్టించుకోని అధికారులు

పొదిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా! పట్టించుకోని అధికారులు

Feb 5, 2026 - 14:47
Feb 5, 2026 - 15:04
 0  70
పొదిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా! పట్టించుకోని అధికారులు
పొదిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా! పట్టించుకోని అధికారులు

ప్రతి పనికీ పైసలు ముట్టజెప్పాల్సిందే. అప్పుడే ఫైల్‌ కదులుతుంది. ఇందుకు కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు దళారుల అవతారమెత్తారు. స్థలం రిజిస్ర్టేషన్లలో సెంటుకు ఇంతంటూ ధరను నిర్ణయించి, తతంగం నడుపుతున్నారు.

ప్రభుత్వం పారదర్శకతకు నూతనంగా తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ విధానంలోనూ లొసుగులు అక్రమార్కులకు కలిసొస్తున్నాయి. గతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడినా అధికారుల తీరులో మాత్రం మార్పురావడం లేదు.

అవసరాలను ఆసరాగా చేసుకుని, క్రయవిక్రయదారుల జేబులను గుల్ల చేస్తున్నారు. ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో "పొదిలి సబ్ రిజిస్ట్రార్" ఆఫీసు పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలను 1 శాతం నుండి 10 శాతం లోపు పెంచాల్సి ఉండగా

అందుకు విరుద్ధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఉల్లంగించి దాదాపు "30 శాతం నుంచి 117 శాతం" వరకు పెంచుతూ తీసుకున్న ప్రతిపాదిత సవరించిన భూముల మార్కెట్ ధరల వివరాలతో కూడిన భూముల మార్కెట్ విలువల లిస్టును స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో సైతం ఇప్పటికే అప్లోడ్ చేసిన విషయంపై మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన No Response. పొదిలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇటీవల కాలంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ లపై జిల్లా ఉన్నతాధికారులతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు మరియు ఏపీ లోకాయుక్త లో కూడా ఫిర్యాదులు చేస్తున్నట్లుగా సమాచారం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News