మండల పరిషత్ నిధులు అడ్డగోలుగా మళ్లింపు..రూ. 2 కోట్ల ప్రజాధనం హాంఫట్!
మండల పరిషత్ నిధులు అడ్డగోలుగా మళ్లింపు..అక్రమాల తీరు ఇలా ఉంది: (M-Book) లేకుండానే బిల్లులు
యర్రగొండపాలెం: 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు (Gram Panchayats, Mandal Parishads, Zilla Parishads) కేటాయించడం మరియు వాటి వినియోగంపై మార్గదర్శకాలు. ఈ నిధులలో 50% "Untied" (ఏ పనికైనా వాడవచ్చు) మరియు 50% "Tied" (త్రాగునీరు, పారిశుధ్యం వంటి నిర్దేశిత పనులకే వాడాలి) గా విభజించారు. ఎం.బుక్ (M-Book) లేకుండా చెల్లింపులు చేయడం ఈ జీవో నిబంధనలకు విరుద్ధం. పనుల నిర్వహణ మరియు నిధుల విడుదల ప్రక్రియ (CFMS ద్వారా చెల్లింపులు). ఏదైనా పనికి నిధులు విడుదల చేయాలంటే తప్పనిసరిగా టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మరియు ఎగ్జిక్యూషన్ రికార్డులు (M-Book) ఉండాలని ఈ జీవో స్పష్టం చేస్తోంది.
మండల పరిషత్తుల్లో నిధుల దోపిడీ: పాత పనులకు కొత్త బిల్లులు: ప్రజావసరాల కోసం ఖర్చు చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో పక్కదారి పడుతున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై నిధులను అడ్డగోలుగా దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కుమ్మక్కు రాజకీయాలు - గుట్టుగా చెల్లింపులు:రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, స్థానిక సంస్థల్లో వైసీపీ ఎంపీపీలే కొనసాగుతున్నారు. వీరు ప్రస్తుత కూటమి నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని, నిధులను పంచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో ఒక్కో మండలానికి సుమారు రూ. కోటి నుండి రూ. రెండు కోట్ల వరకు నిధులు రాగా, వాటిని ప్రజోపయోగ పనులకు వాడకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు.
అక్రమాల తీరు ఇలా ఉంది: ఎం.బుక్లు లేకుండానే బిల్లులు: పనుల పురోగతిని నమోదు చేసే ఎం.బుక్ (M-Book)లు లేకుండానే పాత పనులకు ఇప్పుడు బిల్లులు చెల్లిస్తున్నారు. వెండర్ల ముసుగులో: చిన్న మొత్తాలుగా విభజించి తమకు అనుకూలమైన వారి ఖాతాల్లోకి నిధులను మళ్లిస్తున్నారు. అధికారుల సహకారం: కీలకమైన ఎంపీడీఓ పోస్టుల్లో ఇన్ఛార్జులు ఉండటంతో, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అడిగిన వారికల్లా చెల్లింపులు చేస్తున్నారు.
సొంత పనులకు ప్రభుత్వ నిధులు: ఒక మండలంలో ఎంపీపీ తన సొంత భవనానికి వేయించుకున్న బోర్లకు సుమారు రూ. 3.5 లక్షల ప్రభుత్వ నిధులను వాడుకోవడం గమనార్హం.
స్టేషనరీ పేరిట దందా: ఓ ఫ్యాన్సీ షాపుకు స్టేషనరీ ఖర్చుల కింద రూ. 2 లక్షలు చెల్లించడం, గతంలో పనిచేసిన అధికారులతో వెనక్కు పిలిపించి మరీ ఎం.బుక్లు రాయించి లక్షలాది రూపాయలు డ్రా చేయడం వంటివి వెలుగులోకి వచ్చాయి.
ఖజానా ఖాళీ: విచారణకు డిమాండ్ సామాన్య ప్రజలకు ఉపయోగపడాల్సిన నిధులు ఇలా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుండటంతో మండల పరిషత్ కార్యాలయాల ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. నిధుల వ్యయంపై పారదర్శకత లేకపోవడంతో, ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
What's Your Reaction?