డిప్యూటీ సీఎం ను కలిసిన దర్శి టీడీపీ ఇన్చార్జ్ Dr.గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్

డిప్యూటీ సీఎం ను కలిసిన దర్శి టీడీపీ ఇన్చార్జ్ Dr.గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్

Jan 7, 2026 - 17:31
Jan 7, 2026 - 17:42
 0  72
డిప్యూటీ సీఎం ను కలిసిన దర్శి టీడీపీ ఇన్చార్జ్ Dr.గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్
డిప్యూటీ సీఎం ను కలిసిన దర్శి టీడీపీ ఇన్చార్జ్ Dr.గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్

దర్శి అభివృద్ధికి సంపూర్ణ సహకారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ. సచివాలయంలో బుధవారం ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ ని దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ దర్శి నియోజకవర్గంలోని గ్రామీణ అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాలలో శాశ్వత తాగునీటి అవసరాలు తీర్చే విధంగా అవసరమైన నిధుల మంజూరు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.వెనుకబడిన దర్శి ప్రాంతంలో అనేక అంతర్గత రోడ్లు, డ్రైన్లు గ్రామీణ ప్రాంతాలలో ఇంకా పూర్తి కావలసి ఉన్నాయని వెంటనే పూర్తి చేసేందుకు మన కూటమి ప్రభుత్వంలో ఆ బాధ్యత మనం తీసుకోవాలని డాక్టర్ లక్ష్మీ వివరించారు.

గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి ముందుకు తీసుకు వెళుతున్నామని ఆమె వివరించారు. ఈ సందర్భంగా "ప్రజలు నాడీ తెలిసిన యువ డాక్టర్లు మీరు, ప్రజలకు ఏం కావాలో మీకు తెలుసు. ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత తీసుకోండి, ప్రజల్లో ఉండండి, ప్రజల సమస్యలు తీర్చండి.

ప్రజల ప్రతినిధులుగా మనం ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మనపై ఉంది అందుకు నా సంపూర్ణ సహకారం అందుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్లు దర్శి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు డాక్టర్ లక్ష్మీ వివరించారు. ఇటీవల తుఫాను తాకిడికి కురిచేడు మండలం, బోధనంపాడు గ్రామంలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, తాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని గౌరవ మంత్రివర్యులను కోరడం జరిగింది. ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ లక్ష్మీ వివరించారు.

ఒకసారి దర్శి ప్రాంతంలో పర్యటించాలని కూడా కోరడం జరిగిందని, త్వరలో దర్శి పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తానని హామీ ఇచ్చినట్లు డాక్టర్ లక్ష్మీ ఈ సందర్భంగా తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News