ప్రజల ప్రాణాలతో చెలగాటం! ప్రైవేట్ ట్రావెల్స్ వైఖరి

ప్రైవేట్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవడంలో RTO అధికారుల విఫలం

Oct 24, 2025 - 11:00
Oct 24, 2025 - 11:19
 0  99
ప్రజల ప్రాణాలతో చెలగాటం! ప్రైవేట్ ట్రావెల్స్ వైఖరి
ప్రజల ప్రాణాలతో చెలగాటం! ప్రైవేట్ ట్రావెల్స్ వైఖరి

ప్రైవేట్ ట్రావెల్స్‌ను తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోకపోవడంతో రోడ్డు రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పండుగ సీజన్‌లో ప్రజల వద్ద నుండి వేల రూపాయలు ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. అధిక ఛార్జీల వసూలు, బస్సు ఫిట్నెస్‌ సమస్య, డ్రైవర్లపై ఒత్తిడి వంటివి రోడ్డు రవాణా శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన ఎక్కడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడలేదని వాపోయారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతు న్నారన్నారు. ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది.కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉలిందకొండ దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టుకుని కిందకు దూకేశారు.

బస్సులో ఇంకా 44 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది..ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికుల్లో నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, హారిక, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి ఉన్నట్లు తెలుస్తోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News