మంటల్లో కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు- పలువురు దుర్మరణం

మంటల్లో కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు- పలువురు దుర్మరణం

Oct 24, 2025 - 08:28
Oct 24, 2025 - 08:42
 0  134
మంటల్లో కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు- పలువురు దుర్మరణం
మంటల్లో కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు- పలువురు దుర్మరణం

కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర శుక్రవారం తెల్లవారజామున కావేరి ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సుకు మంటలు అంటుకున్నాయి. ముందు బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి.

కొద్దిసేపట్లోనే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది.బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో 12 మంది బస్సు ఎమర్జెన్సీ డోర్ పగులగొట్టి బయటపడ్డారని చెబుతున్నారు. మిగిలినవారి పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ లేదు. ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్, క్లీనర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో జరిగింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News