
గోమాత ఒకే కాన్పులో రెండు కోడెదూడలకి జన్మనిచ్చిన
రెంటచింతల, మండలంలోని రెంటాల గ్రామ రైతు సింగు వెంకయ్యకు చెందిన గోమాత
ఒకే కాన్పులో రెండు కోడేదూడలకు జన్మనిచ్చి అందర్ని అబ్బురపరిచింది. ఈఘటన గ్రామంలో అందరికి తెలియడడం తో గ్రామస్తులంతా ఆ లేగ దూడలను చూసేందకు క్యూ కట్టారు. అనంతరం గోమాతకు మహిళలు ప్రత్యేక పూజలు చే శారు. ఇటీవలి కాలంలో అరుదైన సంఘటన జరగడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. పశువైద్యాధికారులు డా క్టర్ దీపక్ నాగార్జున, సహాయకులు భాస్కర్, రమేష్ నాయక్ గోమాత సుఖమయ ప్రసవానికి దగ్గరుండి ప్రత్యేక వైద్యం అందించారు.
📢 Advertisement Space - Google AdSense