⏳ Generating...
కర్మ తిరిగి వెంటాడింది: రాప్తాడు దాడి నిందితుడికి జీవితాంతం కష్టాలు తప్పవా?

కర్మ తిరిగి వెంటాడింది: రాప్తాడు దాడి నిందితుడికి జీవితాంతం కష్టాలు తప్పవా?

✍️ R.M. Basha 📅 👁️ 268 views 📍 ఆంధ్రప్రదేశ్ 📰 ARTICLE Big Breaking 🔴 BREAKING⭐ FEATURED
ఈ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారనే చర్చకు రాప్తాడు ఘటన మరోసారి కారణమైంది. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై అత్యంత క్రూరంగా....

పూర్తి కథనం

ఈ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారనే చర్చకు రాప్తాడు ఘటన మరోసారి కారణమైంది. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై అత్యంత క్రూరంగా రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలికపై దాడి అనంతరం అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసుల కాల్పులు జరగడంతో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతడి కుడికాలును వైద్యులు తొలగించారు. ఎడమకాలికి కూడా రక్త ప్రసరణ సక్రమంగా అందకపోవడంతో రెండో కాలును తొలగించాల్సిన పరిస్థితి ఉందా అనే అంశంపై వైద్యులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా పోలీసులతో జరిగిన పెనుగులాటలో చేతికి కూడా తీవ్ర గాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికకు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.
R

R.M. Basha (Senior Reporter & Owner)

R.M. Basha is the founder and senior reporter of RMB News. He has been reporting on Telugu news since 2017.

🔗 Related Articles

← Back to Home

🔐 RMB News Login