ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్?

ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్?
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 06 Aug 2026 RMB

ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్?

| 📍 AP, Amaravathi, ఆంధ్రప్రదేశ్ |

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 13,351 గ్రామ పంచాయతీల్లో 13,151 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో ఎలాంటి ప్రధాన అడ్డంకులు లేవని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎన్నికల ఏర్పాట్ల పురోగతిపై అన్ని జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్‌ల ప్రాతిపదికన నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధికారిక షెడ్యూల్ విడుదలైన తర్వాత పోలింగ్ తేదీలు, నామినేషన్ ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

📢 Advertisement Space - Google AdSense