విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..
RMB News Live Watermark
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 19 Jul 2026 RMB

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..

👤
RMB Reporter Visakhapatnam, ఆంధ్రప్రదేశ్

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు.ఘటనలో చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో చంద్రశేఖర్ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు.