
భక్తిశ్రద్ధలతో వైభవంగా 228 వా నగర సంకీర్తన
శ్రీల ప్రభుపాదుల ఇస్కాన్, జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో 228వ నగర సంకీర్తన ఆదివారం పట్టణంలోని శాంతినగర్ హనుమాన్ మందిరంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు హరినామ సంకీర్తనలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర బాధ్యులు విభీషణ్ ప్రభూజీ భగవద్గీత 3వ అధ్యాయం, 7వ శ్లోకంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.