
దర్శి మున్సిపల్ ఎన్నికలు.. టీడీపీ కీలక వ్యూహం!
దర్శి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ నాయకులు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. గృహనిర్మాణం, స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని నేతలు చర్చించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టి విజయాన్ని సాధించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.