
ఏపీ స్థానిక ఎన్నికలపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్‌పై ఉత్కంఠ!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి మరో రెండు నెలలు పడుతుందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల తేదీలపై అధికారిక ప్రకటన వెలువడినప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొంది. ప్రజలు, రాజకీయ పార్టీలు ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించింది.