
ఏపీ తల్లులకు గుడ్‌న్యూస్.. రెండో విడత తల్లికి వందనం త్వరలోనే!
ఆంధ్రప్రదేశ్‌లో తల్లులకు మరో శుభవార్త! రెండో విడత తల్లికి వందనం పథకం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రెండో వారంలోనే ఈ పథకం నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అర్హులైన తల్లుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.13,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. పిల్లల చదువుకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకంపై తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. నిధుల విడుదల తేదీ, అర్హతలు, తాజా వివరాలపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది.