RMB LIVE NEWS - India's No.1 Short News App

ఏపీకి తుఫాన్ ముప్పు.. అల్పపీడనంతో భారీ వర్షాలు!
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 22న కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ తదితర ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వర్షాల తీవ్రత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
🕐 22 Sep 2026 | 12:25 PM
👁️ 4
📰 Read More