RMB LIVE NEWS - India's No.1 Short News App

ఏపీలో భారీ వర్షాలు...మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం
RMB News Reporter
|
🌐 Telugu
|
ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీపై కొనసాగుతోంది. ఇది పార్వతీపురానికి 60 కి.మీ., ఒడిశాలోని భవానీపట్నానికి 90 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు SDMA తెలిపింది. రాబోయే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
🕐 24 Sep 2026 | 10:23 PM
👁️ 22
📰 Read More