
గాంధీ జయంతినాడే అక్రమ మద్యం?
ప్రకాశం జిల్లాలో గాంధీ జయంతి రోజున కూడా కొన్ని గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు చెల్లించి అక్రమంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారనే స్థానికుల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిజానిజాలను తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.