RMB LIVE NEWS - India's No.1 Short News App

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం.. ట్యాంక్‌బండ్‌కు పోటెత్తిన భక్తులు
RMB News Reporter
|
🌐 Telugu
|
హైదరాబాద్, తెలంగాణ
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్-4 వద్ద పంచముఖ సంకటహర మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేశారు. మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. సెక్రటేరియట్ సౌత్‌ఈస్ట్ మార్గంలోనూ భక్తుల రద్దీ కనిపించింది. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
🕐 25 Sep 2026 | 03:25 PM
👁️ 35
📰 Read More