
మహిళలకు రూ.2,500? ప్రభుత్వం కీలక క్లారిటీ!
తెలంగాణలో మహిళలకు బతుకమ్మ నుంచి నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి పథకంలో 2 తులాల బంగారం అందించనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి పేరుతో మార్ఫింగ్ చేసిన వీడియో, AI ఆధారంగా రూపొందించిన నకిలీ ఆడియోను వైరల్ చేస్తున్నారని ఫ్యాక్ట్‌చెక్ విభాగం తెలిపింది. అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించింది.