RMB LIVE NEWS - India's No.1 Short News App

మేము చేసింది తప్పే.. క్షమించండి! YCP నేతలు..
RMB News Reporter
|
🌐 Telugu
|
Mundlamur, Prakasam, ఆంధ్రప్రదేశ్
ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో వైఎస్ విగ్రహం వద్ద చోటుచేసుకున్న పరిణామం హాట్ టాపిక్‌గా మారింది. గణనాథుని శోభాయాత్రలో గులాం విగ్రహంపై పడిన ఘటనకు సంబంధించి టీడీపీ నాయకుడు కంచుమాటి నాగేశ్వరరావుతో వివాదం నెలకొన్నట్లు సమాచారం. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. తాజాగా వైఎస్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు చేతులెత్తి నమస్కరిస్తూ మేము చేసింది తప్పే క్షమించండి అంటూ క్షమాపణలు చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
🕐 27 Sep 2026 | 06:00 PM
👁️ 14
📰 Read More