
ప్రకాశం జిల్లాలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల!
ప్రకాశం జిల్లాలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 518 సర్పంచ్ స్థానాలు ఉండగా, వీటిలో 515 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ పదవులతో పాటు వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. జిల్లాలో 253 మంది మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. మొత్తం 5,204 వార్డులు ఉండగా, వాటిలో 2,606 స్థానాలు మహిళలకు కేటాయించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.