
రష్యాలో ప్లేగు కలకలం.. మనుషులకు ఎంత ప్రమాదం?
రష్యాలో ప్లేగు కలకలం నేపథ్యంలో ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందన్న చర్చ మొదలైంది. సీనియర్ డాక్టర్ ఎస్. ఫణిరాజు వివరాల ప్రకారం.. ప్లేగు వ్యాధికి ప్రధాన కారణం ఫ్లీ (ఈగలాంటి పరాన్నజీవి) కాటు. సోకిన ఎలుకలు, ఇతర జంతువుల ద్వారా ఈ పరాన్నజీవులు మనుషులకు చేరే అవకాశం ఉంటుంది. జ్వరం, తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు కనిపించొచ్చు. అనుమానం ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం కీలకం.