RMB LIVE NEWS - India's No.1 Short News App

రాయనిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 గరిడేపల్లి, సూర్యాపేట, తెలంగాణ
గరిడేపల్లి, మండలంలోని రాయనిగూడెం గ్రామం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గరిడేపల్లి ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
🕐 21 Sep 2026 | 10:36 PM
👁️ 8
📰 Read More