
రేపు విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్.. చంద్రబాబుతో కీలక భేటీ
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ రేపు విజయవాడకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, 5.45 గంటల వరకు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో సమావేశమై గోదావరి–కావేరి నదుల అనుసంధానం, కృష్ణా జలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాత్రి విజయవాడలోనే బస చేసి, మరుసటి రోజు చెన్నై బయలుదేరనున్నట్లు సమాచారం.