విత్తన బంతులు వెదజల్లు ప్రకృతి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

విత్తన బంతులు వెదజల్లు ప్రకృతి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 03 Aug 2026 RMB

విత్తన బంతులు వెదజల్లు ప్రకృతి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

ఆటవీ సంపదను కాపాడడం భావితరాలకు స్వచ్ఛమైన వాతవారణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒ క్కరూ వ్యవహరించాలని మంచికల్లు జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం షిలార్ అన్నారు. మాడుగుల రిజర్వ్ ఫారెస్ట్లో బీట్ ఆఫీసర్ మనో మనోజ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులు, గ్రామస్తులంతా కలసి విత్తన బంతుల పంపిణీ, విసిరే కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో చేపట్టారు. పచ్చదనం పెంపే ధ్యేయంగా పెట్టుకోవాలని మొక్కల ఆకులకు మేఘాలను ఆకర్షించే స్వభావం వుంటుందని పేర్కొన్నారు. తక్కువ సమయంలో తక్కువ వ్య యంతో కొండలు, గుట్టల్లో భారీ మొక్కలు పెరిగేందుకు విత్తన బంతుల కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గోగుల వెంకట్రామిరెడ్డి, మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి, టీచర్లు, విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

📢 Advertisement Space - Google AdSense
కారంపూడి, నూతన సీఐ,ను సన్మానిస్తున్న మండల టిడిపి నేతలు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 03 Aug 2026 RMB

కారంపూడి, నూతన సీఐ,ను సన్మానిస్తున్న మండల టిడిపి నేతలు

| 📍 కారంపూడి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన అనుభవం
తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని కారంపూడి నూతన సీఐ, ఆవుల భాస్కర్ ఆన్నారు. మండల టీడీపీ అధ్యక్షులు అబ్బిరెడ్డినేతృత్వంలో పలువు రు నేతులు ఆదివారం నూతన సీఐ, భాస్కర్ ను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పెండింగ్ కేసుల ప రిష్కారానికి కృషి చేస్తానని మండలంలోని ప్రతి గామాన్ని సందర్శించి లా అండ్ ఆర్డర్ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను అవగతం చేసుకుని పరి ష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత సుమంత్ రెడ్డి, రామకృష్ణ, ఎం. శౌర్రెడ్డి, ప్రభురాజ్ యాదవ్, ల్యాబ్ అంజి, టి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

📢 Advertisement Space - Google AdSense
పీఆర్సీనీ వెంటనే నియమించాలి, యూటిఎఫ్, ఎస్టియూ నేతలు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 03 Aug 2026 RMB

పీఆర్సీనీ వెంటనే నియమించాలి, యూటిఎఫ్, ఎస్టియూ నేతలు

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

(రెంటచింతల),,రాష్ట్ర ప్రభుత్వం 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని వెంటనే నియమించా లని యూటీఎఫ్, ఎస్టీయూ నేతలు కోరారు. ఆదివారం రెంటచింతలలోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పీఆర్సీ ఏర్పాటుతో పాటు పెండింగ్లో ఉన్న డీఏలను విడు దల చేయాలని ఉద్యోగులందరికి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎ లను అమలు చేయాలని కోరారు. ఇప్పటికే ఎంతో కాలయా పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ కు చెందిన డాక్టర్ చిన్నమ్మ, నాసరయ్య, ఎస్టీయూ జిల్లా కౌన్సిలర్లు అమలబాబు, లేళ్ల శ్రీనివాసరావు, సిలార్ తదితరులు పాల్గొన్నారు.

📢 Advertisement Space - Google AdSense
ఎన్నికల తీరుపై విద్యార్థుల్లో అవగాహన
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 02 Aug 2026 RMB

ఎన్నికల తీరుపై విద్యార్థుల్లో అవగాహన

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రెంటచింతల మండల కేంద్రంలోని ఫాతిమా విద్యానికేతన్లో శనివారం మాక్ పోలింగ్ నిర్వహిం ! చారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ ఏర్పాటు, ఓటర్ల జాబితా పరిశీలన, ఎడమ చేతికి సిరా గుర్తు వేయడం, ఓటరు స్లిప్పుల ; పంపిణీ, ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ సిబ్బంది విధులు, బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, విజేతలు బాధ్యతలు చేపట్టే విధానం తదితర అంశాలను విద్యార్థులే ప్రత్యక్షంగా నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. కార్యక్రమంలో విద్యాసంస్థ కరస్పాండెంట్ ఏరువ ఫాతిమా మర్రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు స్టెఫీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

📢 Advertisement Space - Google AdSense
నేడు ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 02 Aug 2026 RMB

నేడు ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల, మండలం ఆగస్టు 2 తేదీ న రెంటాల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ ఆది వారం జరగనుంది. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూల కంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాను న్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేత గొంటు గోపాలరెడ్డి విగ్ర హాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. జెట్టిపాలెం మోడల్ స్కూల్లో రూ.2.25 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. గోలి గ్రామంలో రూ.1.93 కోట్ల వ్యయ మయ్యే పీహెచ్సీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయను న్నారు

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 01 Aug 2026 RMB

హాస్టల్ ప్రారంభోత్సవం బాలికల కల సహకారంకానుంది, ఎంపీ, ఎమ్మెల్యే .రాక

| 📍 రెంటచింతల మండలం, పలనాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

: మండలంలోని జెట్టిపాలెం మోడల్ స్కూల్లో రూ.1.90 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహం పనులు పూర్తి కావడంతో ఈనెల 2న (ఆదివారం ప్రారంభోత్సవం చేయనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు అబ్బిరెడ్డి, ప్రిన్సిపాల్ కె. పాపయ్యలు చెప్పారు. శు క్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూన్న బాలికల కల సాకారం కానుంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో 25 గదులు నిర్మించడం వల్ల 100 మంది బాలికలు ఉండే అవకాశం ఉంది. 4.5 ఎ కరాల విస్తీర్ణంలో వున్న ఈ పాఠశాల 2013 జూన్ నుంచి క్లాసులు ప్రారంభమయ్యాయి.బండరాళ్లతో కూడిన ఆట స్థలాన్ని చదును చేసి వాడుకలోకి తేవాలని స్టూడెంట్స్ కోరుతున్నారు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై లోకేష్ హైలైట్!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 01 Aug 2026 RMB

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై లోకేష్ హైలైట్!

| 📍 Vizag, Vizag, ఆంధ్రప్రదేశ్ |

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ విమానాశ్రయం ప్రాంతానికి కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. మెరుగైన రవాణా అనుసంధానంతో పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను రాష్ట్ర అభివృద్ధిలో కీలక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం వల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు దేశీయ, అంతర్జాతీయ అనుసంధానం మరింత బలపడుతుందని, పరిశ్రమలు, ఐటీ, ఎగుమతులు, దిగుమతులు, పర్యాటక రంగాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

📢 Advertisement Space - Google AdSense
ముసాయిదా ఓటర్ల జాబితాలో 36 0 64 మంది ఓటర్లు,, తహశీల్దార్
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 01 Aug 2026 RMB

ముసాయిదా ఓటర్ల జాబితాలో 36 0 64 మంది ఓటర్లు,, తహశీల్దార్

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం ముగియడంతో శు క్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను తహశీల్దార్ మర్రి దీప్తి విడుదల చేశారు. ఆగస్టు 30 వరకు ఓటర్ల చేర్పులకు అవకాశం ఉందన్నారు. అభ్యంతరాలను బీఎల్వోలు స్వీకరించి సెప్టెంబర్ 28 లోపు పరిష్కరిస్తామన్నారు ఆక్టోబరు 3 వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఇప్పటి దాకా రెంటచింతల మండలంలోని 11 గ్రామాలు,132 వార్డులు,50 పోలింగ్ బూత్లకు సంబంధించి 40674 మంది ఓటర్లుండగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య 36.064 మంది వున్నారు. డబుల్ ఎంట్రీ, మృతి చెందిన వారు. సమాచారం ఇవ్వని వారు 4600 దాకా వున్నారు. మండలంలోని ఓట్లు సంఖ్య భారీ గా తగ్గిపోయాయి

📢 Advertisement Space - Google AdSense
బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం టిడిపికి పునాదులుబీఎల్ఏలే
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం టిడిపికి పునాదులుబీఎల్ఏలే

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

ఉన్న ఓట్లను తొలగించకుండా నిజమైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ఓటును వి నియోగించుకోవటానికి అవకాశం కల్పించిన టీడీపీకి చెందిన బీఎల్ (బూత్ లెవల్ ఏజెంట్స్) లు చేసిన కృషి ప్రశంసనీయమని పార్టీకీ వారే పునాదులని టీడీపీ మండల అధ్యక్షులు చపారపు అబ్బిరెడ్డి అన్నారు .. మండ ల కేంద్రమైన రెంటచింతలలోని మానస నర్సరీలో మండల స్థాయి బీఎల్ ఏల విస్తృత స్థాయి సమావేశంలో అబ్బిరెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహం, ఊపుతో ముందుకెళ్ళాలని కోరారు.గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్ వేయకుండా అడ్డుకుని అక్రమ కే సులు బనాయించి భయభ్రాంతులకు గురిచేశారు, ఈ సమావేశంలో గొట్టు సుమంత్ రెడ్డి, రామకృష్ణ, నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు

📢 Advertisement Space - Google AdSense
డ్యాం ను పరిశీలిస్తున్న, సీ ఈ, తిరుమల ప్రసాద్
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

డ్యాం ను పరిశీలిస్తున్న, సీ ఈ, తిరుమల ప్రసాద్

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

వర్షాకాలం ప్రారంభమైనందున ఎగువన వున్న నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటిక ప్పుడు అంచనా వేసుకుంటూ విద్యుత్ను తయారు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏపీజెన్కో చీఫ్ ఇంజనీర్ తిరుమల ప్రసాద్ ఇంజనీరింగ్ సి బ్బందిని ఆదేశించారు. గురువారం సత్రశాలలోని కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టును సాధారణ తనిఖీల్లో భాగంగా సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. క్రస్ట్ గేట్లు, రిజర్వాయర్లో వున్న నీటి నిల్వ,మెయిన్ డ్యాం, పవర్ హౌస్లోని టర్తైయిన్లను తనిఖీ చేశారు. ఎస్ఈ ,కె. వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు,ఈఈ, గోదావరి శ్రీనివాస్, ఏడీఈలు అబ్దుల్ మతిన్, జయశంకర్, నిరంజన్, మల్లేష్, కోటేశ్వరరావు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారుల విస్తృత సోదాలు

| 📍 ఆంధ్రప్రదేశ్ |

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు (CBI Raids) నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సీఎస్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీతో పాటు డైరెక్టర్లకు సంబంధించిన పలు ప్రాంతాల్లోని ఆస్తులపై సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీర్చుకొని ఎన్సీఎస్ కంపెనీ నిర్వాహకులు ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు.

📢 Advertisement Space - Google AdSense