రూ.73 కోట్ల ధాన్యం గోల్‌మాల్

RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

రూ.73 కోట్ల ధాన్యం గోల్‌మాల్

| 🌐 Telugu | 📍 Suryapet, తెలంగాణ

సూర్యాపేట జిల్లా బాలెంలలోని వజ్ర రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీలలో రూ.73 కోట్ల విలువైన 29,188 టన్నుల ధాన్యం మాయమైనట్లు తేలింది. ఎఫ్‌సీఐకి చేరాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై TRP పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి, మిల్లులోని నిల్వలను సీజ్ చేశారు.