⏳ Generating...
సామాన్యులపై ధరల భారం.. ప్రజలకు అలర్ట్

సామాన్యులపై ధరల భారం.. ప్రజలకు అలర్ట్

✍️ R.M. Basha 📅 👁️ 137 views 📍 ఆంధ్రప్రదేశ్ 📰 ARTICLE Big Breaking 🔴 BREAKING⭐ FEATURED
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో భారం ఎదురవుతోంది.

పూర్తి కథనం

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో భారం ఎదురవుతోంది. సబ్బులు, టూత్‌పేస్టులు, చాక్లెట్లు, బిస్కెట్లు, టీ, వంట నూనెల ధరల పెంపునకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ముడిసరుకుల ధరలు, తయారీ వ్యయాలు, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో రోజువారీ అవసరాల కోసం ఖర్చు చేసే కుటుంబాల బడ్జెట్‌పై ప్రభావం పడుతోంది. 
ముడి చమురు ఆధారిత పదార్థాల ధరలు 74 శాతం, ప్లాస్టిక్‌ రెసిన్‌ ధరలు 60 శాతం, కోకో ధరలు 46 శాతం పెరిగాయి. అలాగే రవాణా ఖర్చులు 13 శాతం, చక్కెర ధరలు 12.7 శాతం, పామాయిల్‌ ధరలు 10 శాతం, వంట నూనెల ధరలు 9.4 శాతం మేర పెరిగాయి. టీ ధరలు 5.6 శాతం, పాల ధరలు 4 శాతం పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 
ముడిసరుకుల ధరల పెరుగుదలతో పాటు ప్యాకేజింగ్‌, రవాణా ఖర్చులు అధికమవడంతో కంపెనీలపై ఆర్థిక భారం పెరిగింది. ఈ నేపథ్యంలో సబ్బులు, టూత్‌పేస్టులు, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలను పెంచేందుకు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. వంట నూనెలు, టీ ధరల పెరుగుదల కూడా గృహ బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. 
ఇప్పటికే ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అధికంగా ఖర్చు చేస్తున్న కుటుంబాలకు ఈ పరిణామం మరింత భారంగా మారుతోంది. 
ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలు తమ నెలవారీ ఖర్చులను సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
R

R.M. Basha (Senior Reporter & Owner)

R.M. Basha is the founder and senior reporter of RMB News. He has been reporting on Telugu news since 2017.

🔗 Related Articles

← Back to Home

🔐 RMB News Login