RMB LIVE NEWS - India's No.1 Short News App

తేరాల సిద్ధేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి జూలకంటి బ్రహ్మానందరెడ్డి హామీ
RMB News Reporter
|
🌐 Telugu
|
దుర్గి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్
దుర్గి మండలం తేరాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ సిద్ధేశ్వరస్వామి వారిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తుల వినతుల మేరకు ఆలయ అభివృద్ధికి అవసరమైన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో నిధులు మంజూరు చేయించి, ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
🕐 27 Sep 2026 | 06:52 PM
👁️ 2
📰 Read More