
టీడీపీ సమావేశంలో చినకొండేపూడి నాయకుడు కాండ్రు శేఖర్‌కు గౌరవం
సీతానగరం: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీతానగరం మండల యూనిట్ ఇంచార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినకొండేపూడికి చెందిన టీడీపీ యూనిట్ ఇంచార్జి కాండ్రు శేఖర్‌కు ప్రశంసాపత్రం అందజేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రశంసాపత్రం అందుకోవడంతో ఆయనకు గుర్తింపు లభించింది.