
వైఎస్సార్‌సీపీ నాయకులు రాఘవరెడ్డి కన్నుమూత: నివాళులర్పచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
రెంటచింతల మండలం, పాలువాయి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు యర్రసాని రాఘవరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాలువాయి గ్రామానికి వెళ్లి, రాఘవరెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తీవ్ర దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెంటచింతల మండల అధ్యక్షుడు గొట్టం బ్రహ్మారెడ్డి, నర్సిరెడ్డి వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు