RMB LIVE NEWS - India's No.1 Short News App

వైసీపీకి షాక్.. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే!
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 ఆంధ్రప్రదేశ్
ఏపీలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపినట్లు తెలిపారు. త్వరలోనే పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఇటీవల పలువురు వైసీపీ నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
🕐 21 Sep 2026 | 10:04 PM
👁️ 9
📰 Read More