అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం
రెంటచింతల,: మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరినట్లు ఎంఈవో-2 శివ నాగేశ్వరరావు చెప్పారు. మొత్తం 6 ఎస్జీటీ 7 గురు స్కూల్ అసిస్టెంట్లు ఉద్యోగాల్లో చేరారని ఆయన తెలిపారు. అయితే, మల్లవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో హిందీ పోస్టుకు ఎవరూ ఎంపిక కాకపోవడం వల్ల, ఆ పోస్టు భర్తీ అనేది డీఈవో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
🕐 04 Sep 2026 | 09:29 PM
📰 Read More