⏳ Generating...
జడ్పీ ఛైర్మన్లపై కూటమి కసరత్తు..

జడ్పీ ఛైర్మన్లపై కూటమి కసరత్తు..

✍️ R.M. Basha 📅 👁️ 347 views 📍 ఆంధ్రప్రదేశ్ 📰 ARTICLE Big Breaking 🔴 BREAKING⭐ FEATURED
ఏపీ జెడ్పీ చైర్మన్ ఎన్నికల వేళ కూటమిలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నివాసంలో నేతల భేటీతో జడ్పీ ఛైర్మన్ల పంపకాలపై ఉత్కంఠ నెలకొంది.

పూర్తి కథనం

జెడ్పీ చైర్మన్ సీట్లపై కూటమి కసరత్తు.. జనసేనకు 5, బీజేపీకి 1?
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల వేళ కూటమి పార్టీల మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య జడ్పీ ఛైర్మన్ల పంపకాలపై అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు చంద్రబాబు నివాసానికి వెళ్లి చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో మొత్తం 28 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు ఉండగా, వీటిలో 27 స్థానాలు కూటమి ఖాతాలోకి వచ్చే అవకాశముందని తాజా రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది. ఈ 27 స్థానాల్లో జనసేన ఐదు స్థానాలను ఆశిస్తుండగా, బీజేపీకి ఒక స్థానం కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం.
అయితే జనసేనకు ఏ జిల్లాల్లో చైర్మన్ పదవులు ఇవ్వాలి? బీజేపీకి ఏ స్థానాన్ని కేటాయించాలి? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
మరోవైపు అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, రిజర్వేషన్లు కూడా కీలకంగా మారాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కారణంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అనుకున్న అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఎంపీపీలు, మండల స్థాయి పదవుల ఎంపిక బాధ్యతలను ఆయా జిల్లాల నాయకత్వాలకు అప్పగించినప్పటికీ, జెడ్పీ చైర్మన్ స్థానాల విషయంలో మాత్రం పార్టీ అధిష్టానాల నిర్ణయమే కీలకం కానుంది. ఇప్పటికే అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు ఉదయం కూడా కొనసాగినట్లు సమాచారం. ఈరోజేజడ్పీ ఛైర్మన్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకుని అభ్యర్థుల పేర్లను ప్రకటించే దిశగా కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. మరి జనసేన కోరుతున్న ఐదు స్థానాలు దక్కుతాయా? బీజేపీకి ఒక జెడ్పీ చైర్మన్ పదవి ఖరారవుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
R

R.M. Basha (Senior Reporter & Owner)

R.M. Basha is the founder and senior reporter of RMB News. He has been reporting on Telugu news since 2017.

🔗 Related Articles

← Back to Home

🔐 RMB News Login