⏳ Generating...
Cyclone Alert:తీరం వైపు దూసుకొస్తున్న భారీ తుఫాన్

Cyclone Alert:తీరం వైపు దూసుకొస్తున్న భారీ తుఫాన్

✍️ R.M. Basha 📅 👁️ 417 views 📍 ఆంధ్రప్రదేశ్ 📰 ARTICLE Big Breaking 🔴 BREAKING⭐ FEATURED
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అక్వాన్ (Aqwan) తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పూర్తి కథనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం నవంబర్ 15 నాటికి వాయుగుండంగా, నవంబర్ 16న తుఫాన్‌గా బలపడనుంది. (బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అక్వాన్ (Aqwan) తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.) ఈ తుఫాన్ నవంబర్ 18 లేదా 19 తేదీల్లో మచిలీపట్నం - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ నెల 18, 19 తేదీల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. 
తెలంగాణ: ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని, నవంబర్ 21 నుంచి 24 మధ్య తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
ఆంధ్రప్రదేశ్: రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది. తుఫాన్ ప్రభావంతో నవంబర్ 18 నుంచి 20 వరకు ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IMD అమరావతి అంచనా వేసింది.

R

R.M. Basha (Senior Reporter & Owner)

R.M. Basha is the founder and senior reporter of RMB News. He has been reporting on Telugu news since 2017.

🔗 Related Articles

← Back to Home

🔐 RMB News Login