దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం!
శుక్రవారం ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో దర్శి నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్డీవో విజయ జ్యోతి తదితర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సాధ్యమైన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
🕐 31 Jul 2026 | 01:50 PM
📰 Read More