గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి'
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బంది ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ఈరోజు సూర్యాపేట ఎస్పీ నరసింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు, జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని తెలియజేశారు.
🕐 14 Sep 2026 | 08:10 PM
📰 Read More