పొన్నూరులో మహిళ అనుమానాస్పద మృతి.. కుమార్తెపై బంధువుల ఆరోపణలు
గుంటూరు జిల్లా పొన్నూరులో 45 ఏళ్ల మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. క్యాబిన్‌పేటకు చెందిన ఈవూరు లక్ష్మి తన కుమార్తె పుష్పతో కలిసి 8వ వార్డులో నివాసం ఉంటున్నారు. లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారని కుమార్తె చెబుతుండగా, ఆరోగ్యంగా ఉన్న ఆమె అకస్మాత్తుగా మరణించడంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె తన ప్రియుడితో కలిసి లక్ష్మిని హత్య చేసి ఉండవచ్చని వారు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
🕐 12 Sep 2026 | 05:20 PM
📰 Read More