విద్యా కమిటీ చైర్మన్ పేరు మాయం, కులవిక్షకతో ప్రోటోకాల్ ఉల్లంఘించాన్నారు

విద్యా కమిటీ చైర్మన్ పేరు మాయం, కులవిక్షకతో ప్రోటోకాల్ ఉల్లంఘించాన్నారు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 04 Aug 2026 RMB

విద్యా కమిటీ చైర్మన్ పేరు మాయం, కులవిక్షకతో ప్రోటోకాల్ ఉల్లంఘించాన్నారు

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల ,మండలం జెట్టిపాలెం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంలో విద్యా కమిటీ చైర్మన్ పేరును తొలగించడంపై వివాదం చెలరేగింది. ఆగస్టు 2న ప్రారంభించిన ఈ హాస్టల్ భవన శిలాఫలకంలో మంత్రులు, ఎమ్మెల్యే, అధికారుల పేర్లు ఉండగా, మాదిగ సామాజిక వర్గానికి చెందిన దావులూరి రాజేష్ విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయన పేరు లేకపోవటంతో చర్చనీయాంశమైంది. ఈ విషయమై మాజీ మహాజన సోషలిస్టు పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు, ఆది ఝాంభవ లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం లి. అధ్యక్షులు గడ్డిపర్తి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. కుల వివక్షతోనే ప్రోటోకాల్ పాటించకుండా చైర్మన్ పేరును తొలగించారని ఆరోపించారు.

📢 Advertisement Space - Google AdSense
బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం టిడిపికి పునాదులుబీఎల్ఏలే
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశం టిడిపికి పునాదులుబీఎల్ఏలే

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

ఉన్న ఓట్లను తొలగించకుండా నిజమైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ఓటును వి నియోగించుకోవటానికి అవకాశం కల్పించిన టీడీపీకి చెందిన బీఎల్ (బూత్ లెవల్ ఏజెంట్స్) లు చేసిన కృషి ప్రశంసనీయమని పార్టీకీ వారే పునాదులని టీడీపీ మండల అధ్యక్షులు చపారపు అబ్బిరెడ్డి అన్నారు .. మండ ల కేంద్రమైన రెంటచింతలలోని మానస నర్సరీలో మండల స్థాయి బీఎల్ ఏల విస్తృత స్థాయి సమావేశంలో అబ్బిరెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహం, ఊపుతో ముందుకెళ్ళాలని కోరారు.గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను నామినేషన్ వేయకుండా అడ్డుకుని అక్రమ కే సులు బనాయించి భయభ్రాంతులకు గురిచేశారు, ఈ సమావేశంలో గొట్టు సుమంత్ రెడ్డి, రామకృష్ణ, నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు

📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారుల విస్తృత సోదాలు

| 📍 ఆంధ్రప్రదేశ్ |

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు (CBI Raids) నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సీఎస్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీతో పాటు డైరెక్టర్లకు సంబంధించిన పలు ప్రాంతాల్లోని ఆస్తులపై సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీర్చుకొని ఎన్సీఎస్ కంపెనీ నిర్వాహకులు ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు.

📢 Advertisement Space - Google AdSense