
సీతానగరం మండల పరిధిలో జనసేనకు స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతలు
సీతానగరం: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన పార్టీ సమన్వయ కమిటీని నియమించింది. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీకి అందించనున్నారు. ఈ కమిటీలో మద్దాల యేసుపాదం, మండపాటి జగపతి రామకృష్ణంరాజు, కంచర్ల విజయ్ శంకర్, మట్టి వెంకటేశ్వరరావు సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో సీతానగరం మండల పరిధిలోనూ స్థానిక ఎన్నికల సమన్వయానికి స్థానం లభించింది