
ఎస్సీ బాలుర బాలికల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎం.రాజారెడ్డి
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా సంస్కరణలతో విద్యార్థులు జీవితా ల్లో వెలుగు ప్రసరిస్తుందని ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని టీడీపీ రెంటచింతల టౌన్ అధ్యక్షులు ఎం. రాజారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన రెంటచింతలలోని ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహంలో ఉండే స్టూడెంట్స్ కు దుప్పట్లు, ప్లేట్లు, స్వెట్టర్స్, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వార్డెన్లు బేగ్, అరుణుమారిలు అధ్యక్షత వహించార . గురజాల ఏఎస్ డబ్ల్యువో టీవీ.సుజాత కుమారి మాట్లాడుతూ రెండు రోజుల్లో ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం నగదు జమౌతుందని చదువుకే వాడుకోవాలని నొక్కి చెప్పారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలన్నారు..ఈ కార్యక్రమంలో పీ హెచ్సీ చూజీ చైర్మన్ బి.రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense