తిరుమల డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు

తిరుమల డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

తిరుమల డిప్యూటీ ఈవో ఇంట్లో ACB సోదాలు

| 🌐 Telugu | 📍 Tirupathi, ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో ACB సోదాలు కలకలం రేపుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పెద్దకాపు లేఅవుట్‌లోని ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
ACB DSP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకేసారి మొత్తం ఐదు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు తిరుమలలోని ఆయన కార్యాలయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఏర్పేడు మండలం చెల్లూరులోని లోకనాథం సోదరుడి నివాసంలోనూ ACB అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు వెల్లడించే వివరాలపై ఉత్కంఠ నెలకొంది.