
విడదల రజిని ఘటనపై SEC సీరియస్.. ఎస్సైపై విచారణకు ఆదేశం!
పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినికి సంబంధించిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంకపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు, తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఆమెను ఎన్నికల విధులతో పాటు ఇతర విధుల నుంచి కూడా తప్పించాలని స్పష్టం చేసింది.ఘటనకు సంబంధించిన మీడియా కథనాలు, వీడియోలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించాలని SEC ఆదేశించింది.