⏳ Generating...
దరిశి మున్సిపల్ నూతన చైర్మన్‌గా దారం సుబ్బారావు ప్రమాణ స్వీకారం
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

దరిశి మున్సిపల్ నూతన చైర్మన్‌గా దారం సుబ్బారావు ప్రమాణ స్వీకారం

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

దరిశి మున్సిపల్ నూతన చైర్మన్‌గా జనసేన పార్టీ నాయకుడు దారం సుబ్బారావు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దరిశిలోని పొదిలి రోడ్డులో ఉన్న పీజీఎన్ కాంప్లెక్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. వైస్ చైర్మన్‌గా ఎన్నికైన నక్కరంగ సతిమణి నక్క చంద్రతో పాటు వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తదితర ప్రముఖులు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

👁️ 4

🔐 RMB News Login