
దర్శిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి 50 కుటుంబాలు!
దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ముండ్లమూరు మండలం, ఈదర పంచాయతీ పరిధిలోని కొమ్మవరం గ్రామానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.