
ఎన్నికల డ్యూటీ ముఖ్యం కాదు.. కలెక్టర్ కీలక ఆదేశాలు!
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ఈ మేరకు వాయిస్ మెసేజ్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా సిబ్బంది ఇబ్బందులు పడకూడదన్నారు. వాతావరణం అనుకూలించిన తర్వాత సమాచారం అందిస్తామని తెలిపారు. అప్పటివరకు కౌంటింగ్ సిబ్బంది ఇళ్లలోనే ఉండాలని, సమాచారం అందిన తర్వాతే బయలుదేరాలని హెచ్చరించారు.