అరాచకాలకు భద్రత కావాలా?.. అమిత్ షాను వేడుకున్న వైసీపీ!

అరాచకాలకు భద్రత కావాలా?.. అమిత్ షాను వేడుకున్న వైసీపీ!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 07 Aug 2026 RMB

అరాచకాలకు భద్రత కావాలా?.. అమిత్ షాను వేడుకున్న వైసీపీ!

| 📍 ఢిల్లీ |

ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతకు ముప్పు పొంచి ఉందంటూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రత్యర్థులపై పెద్దఎత్తున అరాచకాలు, వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆ పార్టీ నేతలే, ఇప్పుడు రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.