దుర్గి లో డ్రంక్ అండ్ డ్రైవ్,,రూ.10వేలు జరిమానా
దుర్గి లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన పట్రా శ్రీకాంత్ బాబుకు మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి రూ.10 వేల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా దుర్గి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నిందితుడు పట్టుబడ్డాడు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ బి.గోపాల్ హెచ్చరించారు.
🕐 19 Aug 2026 | 05:22 AM
📰 Read More