
ఆకాశమంత అన్న ఎన్టీఆర్..54 అడుగుల మహా విగ్రహం! 🔥🙏
ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారీ విగ్రహం కొలువుదీరింది. శ్రీకృష్ణుడి రూపంలో 54 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ విగ్రహాన్ని ఈ నెల 28న జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా సుమారు రూ.2.30 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. హుస్సేన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహం తరహాలో పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దిన ఈ విగ్రహం నందమూరి అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతోంది.