
ఏపీకి రూ.88 వేల కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో భారీ పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.88,392 కోట్ల పెట్టుబడులతో 18 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 54,210 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కియా పరిశ్రమ విస్తరణ, అనకాపల్లిలో భారీ డేటా సెంటర్, అమరావతిలో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై కూడా కీలక చర్చ జరిగింది.